news logo

రాజకీయాలు

లండన్‌ లో రూ. 473 కోట్ల విలువైన బంగారం చోరీ

December 17, 2019 11:08am

మాజీ ఫార్ములా వన్‌ బాస్‌ బెర్నీ ఎల్‌స్టోన్‌ కుమార్తె తమరా ఎల్‌స్టోన్‌ నివాసం నుంచి రూ 473 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అదృశ్యమయ్యాయి. పశ్చిమ లండన్‌లోని ఎల్‌స్టోన్‌ నివాసంలో 50 నిమిషాలల్లోనే దుండగులు ఈ భారీ చోరీకి తెగబడ్డారు. ముగ్గురు దోపిడీదారులు శుక్రవారం రాత్రి సెక్యూరిటీ గార్డుల కళ్లుకప్పి ఆమె పడక గదిలో ఉన్న లాకర్ల నుంచి విలువైన బంగారు, వజ్రాభరణాలను దోచుకువెళ్లారని ది సన్‌ పత్రిక వెల్లడించింది. బ్రిటన్‌లో ప్రముఖ మోడల్‌, సెలబ్రిటీగా ప్రాచుర్యం పొందిన ఎల్‌స్టోన్‌ దోపిడీ జరిగిన సమయంలో క్రిస్‌మస్‌ సెలవల సందర్భంగా దేశం వీడివెళ్లారని ఆ కథనం వెల్లడించింది. ఈ భారీ దోపిడీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.


Share to Twitter

 

 

Jewellery Stolen in London

 

Related