news logo

రాజకీయాలు

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

November 19, 2019 1:07pm

వరుస విజయాలతో దూసుకుపోతూ, అంతరిక్ష పరిశోధన రంగంలో భారత పతాక గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 25న పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. దీని ద్వారా కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ నెల 25న ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ-47 నింగికెగయనుంది. కార్టోశాట్-3ని 509 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టనుంది. హై రెజొల్యూషన్ ఇమేజింగ్ క్యాపబిలిటీ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను ఈ శాటిలైట్ తీస్తుంది. మరోవైపు, ఇతర 13 నానో శాటిలైట్లు అమెరికాకు చెందినవి కావడం గమనార్హం.


Share to Twitter

 

 

Isro prepared for another experiment

 

Related