news logo

రాజకీయాలు

మహారాష్ట్రలోని నాసిక్‌లో వెరైటీ దొంగతనం...ఉల్లిగడ్డల దొంగతనం చేసిన దొంగలు

September 25, 2019 11:40am

ఎక్కడైనా దొంగలు మామూలుగా డబ్బు కానీ, బంగారం కానీ దోచుకెళుతుంటారు. ఈ దొంగలు మాత్రం కాస్త ముదుర్లు.. అందుకే ఉల్లిగడ్డలు చోరీ చేశారు. ఉల్లిధరలు కొండెక్కడంతో ఇదే మంచి అదును అనుకున్న చోరులు ఏకంగా 25 టన్నుల ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లి తాము సీజనల్ దొంగలమని నిరూపించుకున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. స్థానిక రైతు బజ్‌రావు తన ఇంట్లో లక్ష రూపాయల విలువైన ఉల్లిగడ్డలను నిల్వచేశాడు. మొత్తం 117 ప్లాస్టిక్ డబ్బాల్లో 25 టన్నుల ఉల్లిగడ్డలను వేసవి అమ్మకం కోసం నిల్వ చేశాడు. ఉల్లిధరల నేపథ్యంలో ఈ స్టాక్‌పై కన్నేసిన కొందరు దొంగలు రాత్రికి రాత్రే ఉల్లిగడ్డల బస్తాలను దోచుకుపోయారు. ఉదయం గమనించిన బజ్‌రావు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు. రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఉల్లిదొంగల కోసం గాలిస్తున్నారు.


Share to Twitter

 

 

Onions Thiefs

 

Related