news logo

క్రీడలు

భారత్ చేతిలో ఓటమి బాధ కలిగించింది... ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్

June 25, 2019 11:16am

ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో తమ జట్టు ఓటమి తనను తీవ్రంగా బాధించిందని, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా కలిగిందని పాకిస్థాన్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ అన్నాడు. ‘‘భారత్‌ చేతిలో ఓటమితో గత ఆదివారం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ అది ఒక పేలవ ప్రదర్శన మాత్రమే’’ అని చెప్పాడు. ‘‘ప్రపంచకప్‌ అంటే మీడియా నిశిత దృష్టి, జనం అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఓటములు చవిచూస్తే ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. అందరూ అలాంటి స్థితిని ఎదుర్కొంటారు’’ అని ఆర్థర్‌ అన్నాడు. విధుల పట్ల తాను ఎంత వ్యామోహంతో ఉంటాడో చెప్పడం కోసం ఆర్థర్‌ తీవ్రంగా స్పందించి ఉంటాడు. కానీ 2007 ప్రపంచకప్‌ సందర్భంగా అప్పటి పాక్‌ కోచ్‌ వూమర్‌ మరణించిన నేపథ్యంలో అతడు జాగ్రత్తగా మాట్లాడాల్సివుందని కొందరు అభిమానులు అంటున్నారు. ఆదివారం భారత జట్టు 89 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.


Share to Twitter

 

 

Mickey Arthur

 

Related