news logo

బిజినెస్

రెడ్‌మీ నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్ K20, K20 ప్రో లు వచ్చేస్తున్నాయ్‌

June 4, 2019 11:46am

షామీ నుంచి ఓ కొత్త ఫోన్‌ వస్తోందంటే చాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు టెక్‌ ప్రియులు. అందులోనూ ఇటీవల ఆ కంపెనీ సబ్‌ బ్రాండ్‌ అయిన రెడ్‌మీ ఓ ప్రీమియం ఫోన్‌ తీసుకొస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. k20, k20 ప్రో పేరిట ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్లను భారత మార్కెట్‌లోకి తీసుకొస్తామని ఇది వరకే ఆ కంపెనీ ప్రకటించినా ఎప్పుడనేది తెలియరాలేదు. ఇప్పుడు ఆ ఉత్కంఠకు తెరపడింది. ఈ రెండు ఫోన్లను జులై నెలలో విడుదల చేస్తామని ఆ కంపెనీ ఇండియా చీఫ్‌ మను కుమార్‌ జైన్‌ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. మరో ఆరు వారాల్లో (జులై మధ్యలో) ఈ ఫోన్లను తీసుకొస్తామని పేర్కొన్నారు. అంతకుమించి వివరాలేవీ వెల్లడించలేదు. భారత్‌లో ఆ కంపెనీకి ఉన్న పోటీ దృష్ట్యా వీటి ధరలను కాస్త తక్కువగానే ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎంత ధర ఉంటుందనేది మాత్రం తెలియరాలేదు. చైనాలోని ధరలతో పోల్చి చూసినప్పుడు k20 ప్రో ధరలు ఇలా ఉండనున్నాయి. 6జీబీ+ 64జీబీ వేరియంట్‌ ధర రూ.25,000, 6జీబీ+ 128 జీబీ వేరియంట్ రూ.26,000 ఉండే అవకాశం ఉంది. ఇక 8జీబీ+ 128 జీబీ వేరియంట్‌ ధర రూ.28,000, 8జీబీ+ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.30,000 ఉండనున్నాయి. ఇక K20 మోడల్‌ ధరలు ఈ విధంగా ఉండనున్నాయి. 6జీబీ+64జీబీ, 6జీబీ+ 128జీబీ, 8జీబీ+ 256 జీబీ ధరలు వరుసగా.. రూ.20వేలు, రూ.21వేలు, రూ.26 వేలుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లు ఇదే పేరుతో భారత్‌లో విడుదల కానున్నాయి. అంతకుముందు వీటిని పోకో F2, పోకో F2 ప్రో పేరుతో తీసుకొచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. K20 ఫీచర్లు.. K20 ప్రో ఫీచర్లు.. 6.39 అంగుళాల తెర స్నాప్‌డ్రాగన్‌ 730 ప్రాసెసర్‌ 20మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా 48+8+13 ఎంపీ వెనుక కెమెరాలు 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఆండ్రాయిడ్‌ పై ఓఎస్‌తో ఈ ఫోన్‌ రానుంది. 6.39 అంగుళాల తెర స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ 20మెగా పిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా 48+8+13 ఎంపీ వెనుక కెమెరాలు 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఆండ్రాయిడ్‌ పై ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేయనుంది ఈ రెండు ఫోన్లు పాప్‌ అప్‌ కెమెరాతో పాటు అండర్‌ డిస్‌ప్లే కెమెరాతో రానున్నాయి.


Share to Twitter

 

 

K20 and K20 pro from Redmi

 

Related