news logo

వినోదం

సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నప్పటికీ బరిలోకి దిగడానికి సిద్ధమైపోయిన...బన్నీ

May 22, 2019 1:27pm

విక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ముందుగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే సమయానికి చిరంజీవి 'సైరా' వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అందువలన తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి త్రివిక్రమ్ - అల్లు అర్జున్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ సినిమా, మహేశ్ బాబు - అనిల్ రావిపూడి మూవీ, సాయిధరమ్ తేజ్ - మారుతి సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టుగా చెప్పేశారు. ఇక రజనీ - మురుగదాస్ కాంబినేషన్లోని 'దర్బార్' కూడా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత గట్టి పోటీ ఉన్నప్పటికీ త్రివిక్రమ్ - అల్లు అర్జున్ తమ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలని నిర్ణయించుకోవడానికి కారణం, తమ కథపై గల నమ్మకమేనని తెలుస్తోంది.


Share to Twitter

 

 

Allu Arjun

 

Related