news logo

క్రీడలు

సమరానికి సిద్దమై ఇంగ్లాండ్‌కు పయనమైన కోహ్లీసేన

May 22, 2019 1:12pm

ఇంగ్లాండ్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్‌ జట్టు బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామున ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి కోహ్లీసేన ఇంగ్లాండ్‌ పయనమైంది. కెప్టెన్ కోహ్లీ, ధోనీ సహా ఇతర ఆటగాళ్లు అధికార దుస్తుల్లో విమానాశ్రయంలో ఉన్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బౌలర్లు బుమ్రా, చాహల్‌, హార్దిక్‌ పాండ్యా కూడా ఫొటోలు ట్వీట్‌ చేశారు. ఇంగ్లాండ్‌, వేల్స్‌ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో భారత్‌ తన ప్రయాణం మొదలుపెట్టనుంది. అంతకంటే ముందు న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌లో కోహ్లీసేన రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇంగ్లాండ్‌ బయల్దేరే ముందు కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘వ్యక్తిగతంగా ఇది నాకు అత్యంత సవాల్‌తో కూడుకున్న ప్రపంచకప్‌ అనిపిస్తోంది. ఏ జట్టు ఏ జట్టుకైనా షాకివ్వొచ్చు. ఫార్మాట్‌ ఇంతకుముందులా లేదు కాబట్టి ప్రతి మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే. ఇదో భిన్నమైన సవాల్‌. దీనికి ఎంత ఎంత వేగంగా అలవాటు పడతామన్నది కీలకం’ అని కోహ్లీ అన్నారు.


Share to Twitter

 

 

TeamIndia-leaves-for-worldcup

 

Related