news logo

క్రీడలు

ఆ రహస్యం బయటకు చెబితే నన్ను జట్టు నుంచి తీసేస్తారు: ధోనీ

April 24, 2019 11:40am

ఈ సీజన్‌లో వరుసగా విఫలమైనా సరే వాట్సన్‌ మీద ఉన్న నమ్మకంతోనే జట్టులో స్థానం కల్పించామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని అన్నాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్‌(96) చెలరేగి బ్యాటింగ్‌ చేయడంతో చెన్నై అలవోక విజయం సాధించింది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని మ్యాచుల్లోనూ అంచనాలను అందుకోలేకపోయిన ఓపెనర్‌ బ్యాట్స్‌మన్‌ షేన్‌ వాట్సన్‌కు అవకాశం కల్పించడంపై ధోని మాట్లాడాడు. ‘ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌ విన్నర్‌ వాట్సనే. గత మ్యాచుల్లో రాణించకలేకపోయినా సరే అతను నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తూనే ఉన్నాడు. బంతిని అంచనా వేయడంలో వాట్సన్‌కు కచ్చితత్వం ఉంటుంది. అందుకే జట్టు యాజమాన్యం అతినికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. అలా వచ్చిన అవకాశాన్ని వాట్సన్‌ సద్వినియోగం చేసుకున్నాడు. జట్టు నమ్మకాన్ని నిలబెట్టాడు’ అని ధోని తెలిపాడు. బౌలింగ్‌లోనూ చెన్నై జట్టు బాగా రాణిస్తోండటం మంచి పరిణామమన్నాడు. చెన్నై వరుస విజయాల రహస్యం ఏంటన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ‘ఒకవేళ అందరికీ నేను ఆ రహస్యాన్ని చెప్తే.. వచ్చే ఐపీఎల్‌ వేలంలో చెన్నై యాజమాన్యం నన్ను కొనుగోలు చేయదు. అది వ్యాపార రహస్యం’ అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. అయితే, జట్టు విజయాల్లో అభిమానుల మద్దతు, యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహం కీలక పాత్ర పోషిస్తున్నాయన్నాడు. సహాయక బృందం కూడా మాకోసం ఎంతో శ్రమిస్తూ ఉంటుంది. ఇంతకు మించి నేను ఎక్కువగా చెప్పలేను. రిటైర్‌ అయ్యాక ఏమైనా ఉంటే చెప్తా అని అన్నాడు. ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నాడు.


Share to Twitter

 

 

Dhoni

 

Related