news logo

వినోదం

అదరగొడుతున్న 'ఏబీసీడీ' ట్రైలర్

April 15, 2019 11:30am

అల్లు శిరీష్ కథానాయకుడిగా సంజీవి దర్శకత్వంలో 'ఏబీసీడీ' సినిమా నిర్మితమైంది. రుక్సార్ థిల్లోన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, మే 17వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. ఫ్రెండ్షిప్ .. కామెడీపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. తాను లైఫ్ లో ఎంజాయ్ మెంట్ .. ఎంటర్టైన్మెంట్ .. ఎక్సయిట్ మెంట్ నే కోరుకుంటానంటూ హీరోతో చెప్పించిన డైలాగ్ ఆయన స్వభావానికి అద్దం పడుతోంది. హీరో స్నేహితుడిగా భరత్ మంచి సందడి చేస్తాడని ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మాస్ ను ఆకట్టునే అంశాలు కూడా ఈ సినిమాలో పుష్కలంగానే ఉన్నాయనిపిస్తోంది. కథలో రాజకీయాల కోణం కూడా ఉండటం విశేషం. కోట శ్రీనివాసరావు .. శుభలేఖ సుధాకర్ .. నాగబాబు .. వెన్నెల కిషోర్ .. కీలకమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా అల్లు శిరీష్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.


Share to Twitter

 

 

ABCD Trailer

 

Related