news logo

వినోదం

విభిన్న కథా చిత్రంగా 'మహర్షి' ప్రీ రిలీజ్ బిజినెస్ 145 కోట్లు

April 12, 2019 11:34am

మహేశ్ బాబు మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్న 'మహర్షి' సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ కారణంగా .. ఈ సినిమా భారీస్థాయిలో ప్రీ రిలీజ్ జరుపుకుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 100 కోట్లకు అమ్ముడవ్వగా, నాన్ థియేట్రికల్ హక్కులు 45 కోట్లకు అమ్ముడైనట్టుగా సమాచారం. ఇలా ఈ సినిమా 145 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని అంటున్నారు. 'బాహుబలి' తరువాత టాలీవుడ్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న రెండవ చిత్రంగా 'మహర్షి' నిలిచిందని చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో 'అల్లరి' నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.


Share to Twitter

 

 

Maharshi Movie

 

Related