news logo

వినోదం

మహేశ్ 25వ సినిమాగా 'మహర్షి'...శాటిలైట్ హక్కులకి భారీ ధర పలికింది

April 2, 2019 12:59pm

మహేశ్ బాబు 25వ చిత్రంగా 'మహర్షి' రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, మరికొన్ని రోజుల్లో షూటింగు పార్టును పూర్తి చేసుకోనుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాపై .. అదే స్థాయిలో క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను 11 కోట్లకి అమెజాన్ ప్రైమ్ సంస్థ వారు దక్కించుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు కూడా భారీరేటుకు అమ్ముడయ్యాయి. జెమినీ టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇందుకుగాను వాళ్లు 16.8 కోట్లను చెల్లించినట్టుగా తెలుస్తోంది. 'అరవింద సమేత' తరువాత వస్తోన్న ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే ఆశతో పూజా హెగ్డే ఉందట. ఇక మహేశ్ కూడా ఈ సినిమా 'భరత్ అనే నేను'కి మించి విజయం సాధించాలని భావిస్తున్నట్టుగా సమాచారం.


Share to Twitter

 

 

Maharshi Movie

 

Related